అనంతపురం జిల్లా గుత్తి మండలంలో సిపిఎం పార్టీ అనుబంధ సంఘమైన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల పనులువద్దకు శనివారం స్కూటర్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ మండలంలోని మామిళ్ళ చెరువు గ్రామ ఉపాధి కూలీలకు గత మూడు నెలల నుండి చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని, కూలీల పనిముట్ల పదును లేక పనులు ముందుకు సాగడం లేదని వాపోయారన్నారు. ఎండలు మండుతున్న సందర్భంగా కనీసం ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు మజ్జిగ మెడికల్ కిట్టు కూడా అందుబాటులో లేవని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ కూలీలకు గుత్తి మండల వ్యాప్తంగా ఉన్న పెండింగ్ వేతనాలు చెల్లించాలని పనులు దగ్గర కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో ఈనెల 20,21వ తేదీన గ్రామ సచివాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు వెంకటలక్ష్మి, రంజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
