అనంతపురం జిల్లా గుత్తి మండలం లోని బ్రాహ్మణపల్లి గ్రామంలో తాసిల్దార్ ఓబులేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతుల యొక్క భూములలో భూ సర్వే చేపట్టి పొలము గట్లు కొలచి హద్దులు ఏర్పాటు చేస్తారు కాబట్టి రైతులు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సూర్యనారాయణ, రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ లతా, గ్రామ రెవెన్యూ అధికారి భారతి వెంకట్ రాముడు, గ్రామ రెవెన్యూ సహాయకులు జయరాముడు రైతులు తదితరులు పాల్గొన్నారు
