అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోనీ గుత్తి పట్టణంలోని జంగాల కాలనీ 1 అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార పక్షోత్సవాలలో భాగంగా పోషణ పక్వాడ ముగింపు వేడుకలు సూపర్వైజర్ నాగేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పక్షోత్సవాలలో చివరిదైనా 22వ తారీఖున హక్కుదారులకు ఎలక్ట్రానిక్ పరికరాల వాడుక సమయం కంటే గృహములో పిల్లల వద్ద సమయం ఎక్కువ వెచ్చించవలెను, ముఖ్యంగా టీవీలు మొబైల్ ఫోన్లు పిల్లలపై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు చూస్తుండగా ఎక్కువగా వినియోగించరాదని అవగాహన కల్పించారు. ఊబకాయను పిల్లల్లో ముందుగానే గుర్తించి తగిన పౌష్టికాహారము అందించాలని లబ్ధిదారులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చాకలి గేరి, జంగాల కాలనీ 1,2 అంగన్వాడీ కేంద్రాల టీచర్లు నాగరత్న, శోభారాణి, ఉమామహేశ్వరి హెల్పర్లు ప్రమీల, రజియా ,మహబూబ్బి తదితరులు పాల్గొన్నారు
