అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో స్థానిక పట్టణంలోని చాకలి గేరీ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కిశోర వికాసం వేసవి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా కిశోర బాలికలకు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. కాళ్లు, మోచేతుల వరకు నీటితో శుభ్రపరచుకోవాలి లోదుస్తుల శుభ్రతను పాటించాలి అంటూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ కె లు భారతి, అనిత చాకలి గెరి, జంగాల కాలనీ 1&2, సాయిబాబా టాకీస్, దండు మారెమ్మ గుడి అంగన్వాడీ కేంద్రాల టీచర్లు నాగరత్న, శోభారాణి, చంద్ర లీల, భారతి తదితరులు పాల్గొన్నారు
