అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వెంకట శివుడు యాదవుకు ఆదివారం కూటమి ప్రభుత్వము ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా పదవి దక్కింది. దీంతో స్థానిక పట్టణంలో, స్వగృహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాణసంచా పేల్చి, పూలమాలలు, దుస్సలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
