అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలోగల మోడల్ ఫౌండేషన్ స్కూల్ నందు అంగన్వాడి కేంద్రంలో పిల్లలు నమోదు కార్యక్రమాన్ని అక్షరాభ్యాసాన్ని పండుగ వాతావరణం లో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కేశవరాయుడు మాట్లాడుతూ అంగన్వాడి స్కూలు కుటుంబ పరిసరాలకు అందుబాటులోఉంటాయి. పిల్లలు అంగన్వాడి సిబ్బందిని నిత్యం చూడడం వల్ల ఏ బెరుకు లేకుండా స్కూలుకు వస్తారు అని తెలిపారు. ఇక్కడ విద్యతోపాటు ప్రభుత్వము అందించే పౌష్టికాహారముతో శారీరక ఎదుగుదల ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఆటపాటలతో తల్లి ప్రేమను మరిపించే మరో తల్లులే అంగన్వాడీ సిబ్బందిని చిన్నారుల తల్లులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కళ్యాణి, రత్న, సుప్రియ, అంగన్వాడి టీచర్ రామాంజనమ్మ, సహాయకురాలు రసూల్ బి మరియు తల్లులు పాల్గొన్నారు
