అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బసినేపల్లి గ్రామంలో వైద్యులు డా”ప్రవీణ్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ప్రభలే కాలము ఈ మాసము లోనే కాబట్టి ప్రజలు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం కలిగించే దోమను అరికట్టాలంటే నీటిని వారం కంటే ఎక్కువగా నిలువ ఉంచరాదు.నిలువ ఉన్న నీటిలో లారా ద్వారా దోమలు ఉత్పత్తి అవుతాయి. అలాగే డెంగ్యూ జ్వరం సోకినవారికి విపరీతమైన జ్వరము, కండరాల నొప్పి, ముక్కు, చెవుల ద్వారా రక్తస్రావం జరుగును వెంటనే గుర్తించి అందుబాటులో ఉన్న వైద్యుల ద్వారా ప్రాథమిక చికిత్స పొందవలెను అంటూ స్థానిక ఎంపీపీ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు, దోమ పుట్టకూడదు, దోమ కుట్టకూడదు అనే నినాదంతో గ్రామంలోని ప్రజలకు పెద్ద ఎత్తున డెంగ్యూ జ్వరముపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుత్తి సబ్ యూనిట్ అధికారి ప్రభాకర్, హెల్త్ సూపర్వైజర్ లాజరస్, హెల్త్ అసిస్టెంట్ ఆంజనేయులు ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
