అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా” వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా మున్సిపల్ చైర్పర్సన్ వన్నూరు బి, మండల అధ్యక్షురాలు విశాలాక్షి ఆధ్వర్యంలో వైయస్సార్సీపి జిల్లా నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంజునాథ్ రెడ్డి, క్రషర్ మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ యాదవ్ స్థానిక గాంధీ చౌక్ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ వైయస్సార్, సాధిద్దాం వైయస్సార్ ఆశయాలను, జై.. జగన్, జై.. వైయస్సార్ సిపి అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తూ కేకు కత్తిరించి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బిందె వరలక్ష్మి, వరదరాజులు, ఫరూక్ సివి రంగారెడ్డి, రంగస్వామి, అశ్వ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
