అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్మిక సంక్షేమ మండలి, టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూర్ ఈశ్వర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గుత్తి కోట కు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఉన్నది. కనుక పార్లమెంటులో కోట అభివృద్ది కోసం ప్రస్తావించానని, ఏపీ టూరిజం శాఖ మంత్రిని మరియు అధికారులను 80 కోట్ల కేటాయించి, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం చేపట్టినటువంటి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం లో ప్రజల తో మమేకమై అనేక అంశాలను చర్చించి, ప్రజలకు కావలసినటువంటి సంక్షేమ పథకాలను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ మండల కన్వీనర్లు ఎంకే చౌదరి, బద్రివల్లి, చికెన్ శ్రీనివాసులు, పత్రాలు రామకృష్ణ ,డాక్టర్ హిమబిందు, డాక్టర్ పద్మా రెడ్డి, పి కృష్ణయ్య, విజయ భాస్కర్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
