అనంతపురం జిల్లా గుత్తి సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ సామాజిక తనకీలలో భాగంగా పట్టణంలోని చౌక ధరల ధాన్యపు డిపో నెంబరు మూడు ఆరు షాపుల నిల్వలు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 65 సంవత్సరములు దాటిన వయోవృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలని మండలంలోని రేషన్ షాపు డీలర్లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది బాలు, రేషన్ డీలర్లు దాదు పీరా బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
