అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో వన్ టౌన్ పరిధిలో గల షికారి కాలనీలో సిఐ మనోహర్, టూ టౌన్ సీఐ మస్తాన్ సంయుక్తంగా పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో కార్దన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని ఆరు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. సిఐ మాట్లాడుతూ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు పై ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. ఎవరైతే సమాచారం ఇస్తారో .. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
