కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రతి మాసము మూడవ శనివారము తలపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్, స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ వైద్యశాల కమిటీ చైర్మన్ శ్రీనివాసులు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులతో కలసి ప్లాస్టిక్ వాడకమును నిషేధచండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహము నుండి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ సర్కిల్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ సింగల్ యూస్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ వాడకం వల్ల మానవాళికి వివిధ రకాలైన అంతుచిక్కని వ్యాధులు బారిన పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పర్యావరణంలోని మార్పులను ప్రతి ఒక్కరూ గమనించి ప్లాస్టిక్ మహమ్మారిని పారద్రోలే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాంబాబు, డి ఈ హేమ చంద్ర, ఆర్ ఓ కమలాకర్ సతీష్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, సి ఓ లు చంద్రశేఖర్, ప్రసన్న బాబు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
