అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం 14వ వార్డు మరియు 16 వ వార్డుల నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అవ్వా తాతలకు పెన్షన్ 4000వేలు చేసారు, మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, మరీ ముక్యంగా తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి వారి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేసారు, గత ప్రభుత్వం లో ఇంట్లో ఒకరికి మాత్రమే అమ్మ ఒడి పథకం కింద డబ్బులు ఇచ్చే వారు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజా సంక్షేమం కోరే సూపర్ సిక్స్ లో చెప్పిన హామీలు అన్నీ తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ మళ్ళీ చంద్రబాబు గారిని ఆశీర్వదించాలని వార్డు ప్రజలను కోరారు..ఈ కార్యక్రమం లో గుంతకల్లు టిడిపి పట్టణ ఇన్చార్జ్ నారాయణస్వామి కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు 14వ వార్డు మరియు 16వ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
