అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గల బాలికల గురుకుల పాఠశాల జిల్లాలోనే పీఎం స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా గుర్తింపు పొందినందుకు చాలా ఆనందంగా ఉందని జిల్లా విద్యాధికారి ప్రసాద్ బాబు తెలిపారు. దేశంలో విద్యా వ్యవస్థను పటిష్ట పరచడానికి కేంద్రము ప్రవేశపెట్టిన ఎన్ ఈ పి-2020 ఐదవ వార్షికోత్సవ సందర్భంగా పాఠశాలలో కెమిస్ట్రీ ల్యాబ్, వంటగదులు, ఆట స్థలము, వాలీబాల్, కో కో, కబడ్డీ, వర్షపు నీరు ఇంకుడు గుంతలు, రన్నింగ్ కోర్టు తదితర కేంద్ర నిధులతో విజయవంతంగా పూర్తి చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అభివృద్ధి పనులను వర్చువల్ మీట్ ద్వారా జాతికి అంకితం ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి-2 మనోహర్, పాఠశాల ప్రధాన ఉపధ్యాయురాలు విజయలత, ఏఈ నరేంద్ర మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
