అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సి పి ఐ మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బుదవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి నిజాం ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది. అక్కడ సమావేశపరచిన సభకు సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు అధ్యక్షతన ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ , సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి, సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్రం కోసం నిరంతరం కష్టపడిన కష్టపడి ప్రాణ త్యాగాలు కూడా లెక్కచేయకుండా పోరాడిన ఏకైక పార్టీ సిపిఐ. నేడు అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అయినా భారత కమ్యూనిస్టు పార్టీ కు నేటికి తగ్గటం లేదు, అనేక ఉద్యమాలు చేస్తుంది ప్రతి ఉద్యమం వెనక సిపిఐ ప్రజా సంఘాల పాత్ర కీలకం వహిస్తున్నది అలాంటి పార్టీ మహాసభలు మనము ఘనంగా నిర్వహించుకున్నందుకు సంతోషంగా ఉన్నదని వారు తెలిపారు. మరియు పేదలకు పన్నుల, విద్యుత్ భారాలు పడకుండా చూడాలని సిపిఐ పార్టీ అనేకమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసిన గతంలో వైఎస్సార్ ప్రభుత్వం కేంద్రానికి, ఆదానికి తల వంచి విద్యుత్ ఒప్పందాలు చేసుకుంది. నేడు టిడిపి ప్రభుత్వం ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం అమలు పరుస్తుంది.ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు వల్ల ఒక సంవత్సరానికి 17845 కోట్లు వసూలు చేసింది. ఇలా సర్చార్జీలని మొదలగు పన్నులు ప్రజలపై పెనుబారం మోపుతోంది దీన్ని సిపిఐ ఖండిస్తుందన్నారు. ఈ సమస్యను క్షేత్రస్థాయి కూడా తీసుకువెళ్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేశారు. మరోపక్క పి ఫోర్ అనే విధానాన్ని తీసుకొచ్చి కొన్ని కుటుంబాలు అధికారులు ప్రజాప్రతినిధులు దత్తకు తీసుకుంటున్నామని పత్రికల్లో వస్తున్నాయి, మేము పి ఫోర్ కు వ్యతిరేకులం కాదు ఆంధ్రప్రదేశ్ లో అనాధలు వేలాదిమంది ఉన్నారు మీరు రైల్వే స్టేషన్ లోనూ, బస్టాండ్ దగ్గర బిక్షం ఎత్తుకునే పరిస్థితి రాకుండా పి4లో పొందవరిస్తే చాలా సంతోషిస్తామన్నారు. స్థానిక పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం వేలాది అర్జీలు ఇచ్చిన నేటికీ పరిష్కారం కాలేదు వీటిని వెంటనే పరిష్కారం చేయకపోతే సిపిఐ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రజలకు మేమే సిపిఐ పార్టీగా ఇళ్ల స్థలాలు పంచుతామని సంబంధిత అధికారులకు హెచ్చరిక చేశారు. మరోపక్క రైతులను ఆదుకుంటున్నామని రైతు సుఖీభవ కింద 7000 వారి అకౌంట్లో వేస్తున్నారు, రైతులు బిక్షగాళ్లు కాదు వారికి పంట పండించే దానికి ప్రతి ఎకరాకు సాగునీరు విత్తనాలు ఎరువులు పనిముట్లు 90% సబ్సిడీ తో ఇచ్చి ఆదుకుంటే రైతులకు న్యాయం చేసినట్లు ఉంటుందని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామదాసు, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
