1985 కారంచేడులో 1991 చుండూరులో జరిగిన మాల మాదిగ కులాలపై అగ్రవర్ణ కులాలు విచక్షణారహితంగా దాడులు జరిపి మరణ మృదంగం సృష్టించారు. ఈ ఘటనలో అసువులు బాసిన దళితులకు ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. మొదటగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల అంబేద్కర్ గారి విగ్రహం కు పూలమాలలు వేసి నాటి ఘటనలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నేటికీ సమాజంలో దళితుల పట్ల అస్పృశ్యత అంటరానితనము కొన్ని గ్రామాల్లో ప్రజలు గురవుతున్నారు. రాజ్యాంగ హక్కులు సాధించుకోవడానికి రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నారు. మన ఓట్లతో అగ్రకులాల నాయకులు రాజకీయ పార్టీలను నడుపుతున్నారు. అంబేద్కర్ ఆశయాలు సాధించాలంటే రాజ్యాంగ చట్టాలను అనుసరించి రాజకీయ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BSP నాయకులు బండల రామాంజినేయులు, వెంకట కొండయ్య, KVPS నాయకులు మల్లికార్జున, అగ్గి రాముడు, అంజన్ ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు మిద్దె ఓబులేసు, MRPS గుంతకల్లు నియోజకవర్గం ఇంచార్జ్ అడవి రాముడు, రామాంజి, నీలం ఆదినారాయణ, చిన్న కుళ్లాయి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
