గుత్తిలో ఆజాది కా అమృత్ వేడుకలు ప్రారంభం అనంతపురం జిల్లా గుత్తి మునిసిపల్ కార్యాలయము నందు ఆజాద్ ఇక అమృత్ వేడుకలు భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వహణ జరిగినది. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుల స్మరించుకుని వారి కుటుంబ సభ్యులను భాగస్వాములను చేసి ఎద్దుల శరబారెడ్డిగారి కుమారుడు ఎద్దుల సూర్యనారాయణ రెడ్డి, కలుగోట్ల వెంకట్రామయ్య గారి తమ్ముని కుమారుడు కలుగోట్ల రామమోహన్ ను మునిసిపల్ చైర్ పర్సన్ వన్నూర్ బీ , కమీషనర్ బి.జబ్బార్ మియా సన్మానించి వారి ద్వారా గాంధీ గారు పెద్దవడుగూరుకు విచ్చేసిన సమయంలో స్వాతంత్ర్య ఉద్యమ ఘటనలు మరియు స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలను మననం చేసుకున్నారు. అనంతరం మునిసిపల్ కార్యాలయం నుండి ఎన్ టీ ఆర్ సర్కిల్ గుండా గాంధీ సర్కిల్ వరకు భారత్ మాతాకీ జై.. ప్రతి ఇంట జెండా పండుగ.. అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాంబాబు, డి.ఈ.ఈ హేమచంద్ర కుమార్ , టిపియస్ మారుతి ప్రసాద్ , శానిటరీ ఇన్స్ పెక్టర్ మహబూబ్ భాషా, ఆర్.ఓ కమలాకర్ సతీష్ , మెప్మా అధికారులు చంద్ర శేఖర్ , ప్రసన్నబాబు , గుత్తి కోట భాస్కర్, మెప్మా ఆర్.పి లు, మహిళా సంఘాల సభ్యులు, సచివాలయ సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









