అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన నంది అవార్డు గ్రహీత చిత్రకు స్థానిక సిపిఎం పార్టీకి చెందిన అంపయ్య భవనంలో జిల్లా ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షులు కృష్ణమూర్తి పూలమాలతో దుశ్యాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక నియోజకవర్గంలో కలల పట్ల అంకితభావంతో ఎంతోమంది కళాకారులు వారి వారి కళా నైపుణ్యాలతో జాతరలలో పండుగల వేడుకలలో బహిరంగ సభలలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు అందులో భాగమే నేటి చెక్కభజన కళాకారుని ప్రతిష్టాత్మకంగా పిలవబడే నంది అవార్డు గ్రహీత చిత్ర ఒకరు.అతి పురాతనమైన చారిత్రాత్మకమైన చరిత్ర గలిగిన రాయలసీమ ప్రాంతం నుండి ఎంతోమంది కళాకారులు ప్రఖ్యాతిగాంచిన కవులలు కు పుట్టినిల్లు నేడు ఈ కలలను వెలికి తీసే బాధ్యతగా ప్రజానాట్యమండలి తీసుకుంటుంది కావున అటువంటి కలలను కళాకారులను తెలియజేస్తే జిల్లా వ్యాప్తంగా వారికి ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డులు తెచ్చి కలలు పోషిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజే రావు విజ్ఞాన కేంద్రం నాయకులు సురేంద్రబాబు మహిళా సంఘం నాయకురాలు జ్యోతి, డి ఐ ఎఫ్ ఐ నాయకులు నాగరాజు, పూర్వపు విద్యార్థి సంఘం నాయకులు బి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
