అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ని ఫుట్బాల్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనము లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు 80వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్ర పటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వక్తలు మాట్లాడుతూ మనము కూడా దేశ నాయకులు అడుగు జాడలలో నడవాలి.వీరు సివిల్స్ పరీక్ష లో దేశ వ్యాప్తంగా నాల్గవ స్థానము పొంది ,బ్రిటిష్ రాజ్యంలో కలెక్టర్ పదవి దక్కినప్పటికి ఆ పదవికి రాజీనామా చేసి భారత జాతి స్వాతంత్య్ర ము కోసం తన జీవితాన్ని అంకితం చేసారు.వీరు జర్మనీ, జపాన్, మలేషియా, ఫిలిఫైన్ మొదలగు దేశాల తో చర్చించి 40,000 మంది సైన్న్యాన్ని తయారు చేసి రాస్ బిహారీ బోస్ తనకు అప్పజెప్పి ఆజాద్ హింద్ ఫౌజ్ ని మరింత పటిష్టం చేశారు. వీరి మరణం గురించి ఇప్పటి సమగ్ర సమాచారం లేదు అని తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు కార్య దర్శి జెన్నే కుల్లాయిబాబు, సెక్రెటరీ రామ్ మోహన్,ఫక్రుద్దీన్, షైక్షా వళి,నారాయణరెడ్డి, చెన్నారెడ్డి, హస్సన్ అహమ్మద్, నారాయణ శెట్టి,శామ్యూల్, దేవదాస్ మొదలగు వారు పాల్గొన్నారు.
