ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో వెంటనే అడ్మిషన్లు ప్రారంభించాలని కోరుతూ అనంతపురం జిల్లా గుత్తి తాసిల్దార్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తరిమిల గిరి, మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్న డిగ్రీ విద్యార్థులకు ఇంకా అడ్మిషన్లు ప్రారంభం కాలేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించాలని కోరడం జరిగింది. అదేవిధంగా గత రెండు వారాల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించి అనారోగ్యం పాలు కాకుండా చూడాలని, అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా 77 వ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న జీవో పైన విద్యాశాఖ మంత్రి మాట్లాడ్డం లేదు. విద్యార్థుల సమస్యల తో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ పుణ్యవతికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్. చరణ్, థామస్, జగన్, ఓం సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు
