అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగినది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, జనసేన గుంతకల్లు నియోజకవర్గం బాధ్యులు వాసగిరి మణికంఠ కు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు గుత్తి పట్టణం గాంధీ సర్కిల్ వద్ద బాణాసంచా పేల్చి, క్రేన్ల సహాయముతో గజమాలలు వేసి ఘనంగా ఆహ్వానం పలికారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహము నుండి భారీ వాహన శ్రేణి మధ్య ఆర్ఎస్ లో గల మార్కెట్ యార్డు ప్రాంతానికి విచ్చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన జక్కల చెరువు ప్రతాప్ తో పాటు మరో పదమూడు మంది డైరెక్టర్లు చేత మార్కెట్ యార్డ్ సెక్రటరీ బాలాజీ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని కులాల అన్ని మతాల ప్రజలను రాజకీయ భాగస్వాములను చేయాలని అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల ద్వారా చాలా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు గుత్తి పామిడి తెలుగుదేశం ఇన్చార్జులు గుమ్మనూరు నారాయణస్వామి, గుమ్మనూరు ఈశ్వర్, గుమ్మనూరు శ్రీనివాసులు, గుత్తి పట్టణ మండల కన్వీనర్లు ఎంకే చౌదరి, బద్రి వలి, ఎర్రగుడి రమేష్, చికెన్ శ్రీనివాసులు, న్యాయవాది సోమశేఖర్, నగదాని జయన్న, పవన్ యాదవ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
