అనంతపురం జిల్లా గుత్తి పట్టణం గుంతకల్ రోడ్డు నందుగల చెరువు కట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ భూషణ్ గ్రహీత” డా” చిరంజీవి సేవా దృక్పథం కలిగిన వ్యక్తికి సంపూర్ణ ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, తన సేవా కార్యక్రమాలతో మరిన్ని జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని భగవంతుని కోరుకుంటూ అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షులు పాటిలు సురేష్, రాష్ట్ర రామ్ చరణ్ తేజ్ యువశక్తి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, సీనియర్ అభిమానులు చిన్న వెంకటేశ్వర్లు, అశ్వ నాగప్ప, వెంకటపతి నాయుడు, మిద్దె ఓబులేష్, కుళాయిప్ప, రంగా ,వెంకటేష్, మురళి నాయక్, వంశీ, హరి, సాయి, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.
