అనంతపురం జిల్లా, ఆగష్టు 26: యాడికి మండల కేంద్రంలోని ఎయిర్టెల్ ఆదిరెడ్డి సేవా కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో ఓబుళాపురం గ్రామానికి చెందిన బోయ రాముడు కుమారుడు బోయ వెంకటరాముడు ప్రమాద భీమా చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అధికారికంగా అందజేశారు.
బోయ వెంకటరాముడు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అతని కుటుంబ సభ్యులు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకును సంప్రదించగా, బ్యాంకు వారు మరణించిన వ్యక్తి మరియు నామిని వివరాలను సేకరించి, అవసరమైన ప్రాసెస్ అనంతరం రూ. 2 లక్షల ప్రమాద భీమా సాయం మంజూరు చేశారు.
ఈ చెక్కును మండల అభివృద్ధి అధికారి (MPDO) వీర్రాజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తోంది. బ్యాంకు ఖాతా కలిగి ఉన్న వినియోగదారులకు భవిష్యత్ భద్రత కల్పించే విధంగా ప్రమాద భీమా వంటి సేవలు చాలా ఉపయోగపడుతున్నాయి,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎయిర్టెల్ ZSM ఛత్రపతి రెడ్డి, TM జగదీష్, ZM ఐత నవీన్ శెట్టి, ZTM సంపంగి శ్రీనివాసులు, CGO బాషా, RBM విష్ణువర్ధన్, యాడికి మండల డిస్ట్రిబ్యూటర్ ఆదిరెడ్డి, షణ్ముఖ రెడ్డి, తాండ్ర విక్రమ్, మీసేవ జగదీష్, పెయ్యాల ప్రతాప్ రెడ్డి, సెల్ పాయింట్ నిర్వాహకులు మారుతి, శ్రీకాంత్, చింత నరేష్, గంగవరం రాజా, కోడూరు రాజారంగా రెడ్డి, యాడికి మండల ఎయిర్టెల్ నిర్వాహకులు యుగంధర్ రెడ్డి, ఓబుళపతి, రంగనాథ్, బాలు, సుదర్శన్ తదితరులు హాజరయ్యారు.