అనంతపురం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి జరిగిన వివిధ పరీక్షల యందు ఉత్తీర్ణత పొంది కానిస్టేబుల్ ఉద్యోగాలను (సివిల్ మరియు ఏపీఎస్పీ) సాధించిన అభ్యర్థులందరికీ జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS ఆధ్వర్యంలో DPO సిబ్బందితో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో సివిల్ , ఏపీఎస్పీ విభాగాలకు ఎంపికైన మొత్తం 488 మంది అభ్యర్థులు వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరవ్వాల్సి ఉండగా 470 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 18 మంది అభ్యర్థులు ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కాలేదు.. సివిల్ – 278 మంది గానూ 266, APSP- 210 మందికి గానూ 204 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు మొత్తం 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల విద్యార్హతలు, క్రీడా సర్టిఫికేట్లు, కేటగిరీకి సంబంధించిన ధ్రువపత్రాలు సహా అన్ని అవసరమైన పత్రాలను సక్రమంగా పరిశీలిస్తున్నట్లు, అభ్యర్థుల భవిష్యత్ ఉద్యోగ జీవితానికి ఈ ధ్రువపత్రాల పరిశీలన అత్యంత ముఖ్యమని, పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, AO రవిరాంనాయక్, సూపరింటెండెంట్ గోపి మరియు DPO సిబ్బంది పాల్గొన్నారు.
