అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని టీవీ స్టేషన్ నందు గల మదర్ తెరిసా విగ్రహం వద్ద జన విజ్ఞాన వేదిక,విక్టరీ ఫౌండేషన్, అమ్మ దీవెన సంస్థల ఆధ్వర్యంలో మదర్ తెరిసా 116 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్ టూ టౌన్ సీఐ మస్తాన్ పాల్గొని ప్రసంగిస్తూ యుగోస్లేవియాలో పుట్టి.. భారత్‌కు ఉపాధ్యాయురాలిగా వచ్చిన ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ.. తన సామాజిక సేవల ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపును పొంది ‘అమ్మ’ అయ్యారు.ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్‌కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా అని తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి అమ్మగా మారింది అని ఆయన పేర్కొన్నారు. మదర్ తెరిసా సేవల అమోఘమని కాబట్టే ఆమె విశ్వమాత కాగలిగిందని తెలిపారు . అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు వి.గంగరాజు, జనవిజ్ఞాన వేదిక కార్యదర్శి హరి ప్రసాద్ యాదవ్, విక్టరీ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ కుమారి, అమ్మ దీవెన సంస్థ అధ్యక్షులు మేస్త్రి దొడ్డప్ప, సాయి మహిళా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ప్రభాకర్, కమిటీ సభ్యులు మంజునాథ్, రోజీ, అర్చన తదితరులు పాల్గొన్నారు.
