అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ గుత్తి పట్టణంలోని సితార ఫంక్షన్ లో ఏర్పాటు చేసినసభకు ముఖ్యఅతిథిలు గా విచ్చేసి లబ్ధిదారులకు నూతన రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన చేపట్టినప్పటి నుండి పౌరసరఫరాల శాఖలో ప్రత్యేకమైన మార్పులతో పంపిణీ వ్యవస్థలో, నూతన రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అన్నారు. ప్రతి లబ్ధిదారుడికి రేషన్ దుకాణాల నుండి డీలర్ల ద్వారా సక్రమంగా రేషన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు నేరుగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయడం కొత్త చరిత్ర సృష్టించిందని తెలిపారు. అందులో భాగంగానే నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వము రూపొందించిన రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేపట్టారు. స్థానిక మండల వ్యాప్తంగా 24,810 రేషన్ స్మార్ట్ కార్డులు మంజూరైనవి కాబట్టి ప్రజలందరూ వీటి ద్వారా ప్రతి నెల రేషన్ షాపుల వద్దకు వెళ్లి ఉచిత బియ్యము నిత్యావసర సరుకులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, తహసిల్దార్ పుణ్యవతి, ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ టిడిపి నాయకులు పట్టణ కన్వీనర్ చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ మెంబర్ చికెన్ శ్రీనివాసులు, రేషన్ డీలర్లు రంగస్వామి, కే నాగరాజు దాదు పీరా ఈరన్న గొందిపల్లి రామన్న శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
