ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన నిరసనలు రెండవ రోజుకు చేరుకున్నది. అనంతపురం జిల్లా ఉత్తి పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన శిబిరంలో గ్రామీణ రెవెన్యూ సహాయకులు పలు డిమాండ్లతో మోకాళ్లపై కూర్చుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వి ఆర్ ఏ సంఘం నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలి, కారుణ్య నియామకాలు చేపట్టాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పే స్కేలు అమలు చేయాలి అంటూ పలు డిమాండ్లతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు చిరంజీవి, సుధాకర్, జగదీష్, నారాయణస్వామి, యుగంధర్, పెద్దన్న, ధన తదితరులు పాల్గొన్నారు
