అనంతపురం జిల్లా గుత్తి సబ్ జైలు ను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎన్ రాజశేఖర్ గుత్తి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జి బి.సాదు బాబు ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు .సబ్ జైలు నందు బ్యారెకులు, మరుగుదొడ్లు ,వంటగది ,స్టోర్ రూమ్, రికార్డులు పరిశీలించారు. ఖైదీలతో సమావేశం అయ్యి న్యాయసదస్సు ఏర్పాటు చేసి న్యాయ సలహాలు అందజేశారు . జైలు ఆవరణము యందు కంపోస్ట్ యార్డులు,ఏర్పాటు చేయవలెనని జైలు సూపర్డెంట్ మహేష్ వరుడుకు సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వి.సీ గంగాధర్ కుమార్, టైపిస్ట్ సాదిక్ వలి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
