అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆకు తోటలు గిట్టుబాటు ధర లేక రైతులకు, కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని ఆకుతోట రైతుల సమావేశంలో వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం 30 సట్టలు ఆకులు 200 రూపాయలు ఉంటే రైతులకు గిట్టుబాటు కాదు. కావున 30 సట్టలు ఆకులు ఎనిమిది వందల రూపాయలు ధర ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఆకుతోటలను పరిశీలించడానికి వ్యవసాయ అధికారులు రావడం లేదు. సూచనలు సలహాలు ఇవ్వక పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోయారు. తక్షణమే అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించి ఆకుతోట రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఏపీ రైతు సంఘం డిమాండ్ చేస్తోంది. తక్షణమే ఆకుతోట రైతులను ఆదుకోవాలి లేనిపక్షంలో రైతులతో కలుపుకొని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దస్తగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కిష్ణుమూర్తి, రైతు సంఘం అధ్యక్షులు మద్దిలేటి, పెద్దయ్య, రైతు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
