అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా మలేరియా సబ్ యూనిట్ అధికారి ప్రభాకర్ దోమల నివారణకు గాంబుషియా చేపలు రంగంలోకి దింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక పట్టణంలోని టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరముల తో పాటు డెంగ్యూ జ్వరము బారిన పడి మృత్యువాత పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కనుక జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి ప్రత్యేకంగా తెచ్చిన గంబుషియా చేపలను స్థానిక పట్టణంలోని వక్కల కుంట, బండగరిలో గల బావుల నందు మండలంలోని రజాపురం, ఊబిచర్ల గ్రామాల నందు గల కుంటలలో వదిలారు. దోమల నివారణకు దోమ యొక్క గుడ్డు, లార్వాదశలోనే నిర్మూలించుటకు గాను ఈ చేపలు ఎంతగానో దోహదపడతాయి అన్నారు . అలాగే ప్రజలకు దోమల నివారణకు నీరు నిలవ లేకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఫ్రెష్ డే- ఫ్రైడే పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ఆంజనేయులు, ఏఎన్ఎంలు రబియ,రూప, నాగవేణి , రోజా, మాధవి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
