అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మండలంలోని జక్కలచెరువు గ్రామ సచివాలయ పరిధిలో మోడల్ అంగన్వాడి స్కూల్ నందు ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం, ప్రపంచ హ్యాండ్ వాష్ డే లను జరుపుకున్నారు. ముందుగా గ్రామ వీధులలో బాలికలను చదివిద్దాం- బాలికను ఎదగనిద్దాం, బాలికగా నాతోనే మార్పు వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయుడు కేశవ నాయుడు, ఐసిడిఎస్ సూపర్వైజర్ దస్తగిరమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల పట్ల బ్రూణ హత్యలు నిలువరించాలి. కుటుంబంలో మగ ఆడ సంతానాలకు సమాన ప్రాధాన్యత కల్పించాలి. చిన్నారులకు మరియు తల్లులకు వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు కళ్యాణి, సుప్రియ, అంగన్వాడీ సిబ్బంది రామాంజనమ్మ, రత్న, శారద రసల్ బి తదితరులు పాల్గొన్నారు.
