అనంతపురం జిల్లా గుత్తి పట్టణం లో ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు కరిడికొండ సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక కొత్తూరు లో గల స్వీట్ సేవియర్స్ చారిటబుల్ ట్రస్ట్ అనాధాశ్రమంలో లో కేక్ కటింగ్ చేసి, భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి స్థానిక తాడిపత్రి రోడ్డులో గల తన నివాసంలో కూటమి శ్రేణి నాయకులు, అభిమానులు, సన్నిహితులు, మీడియా సోదరులు పూలమాలలు వేసి దుశ్యాలవాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి, పరశురాముడు, రామ్ రాజా యాదవ్, అరుణ్ యాదవ్, రాయల్ రాజు ,పవన్ యాదవ్ ,వాల్మీకి రాము, జనసేన నాయకులు పాటిల్సురేష్, మిద్దె ఓబులేసు, పత్రాల రామకృష్ణ, నారాయణ స్వామి, రవితేజ నారాయణస్వామి, హమాలి శేఖర్, మీసేవ సురేష్, ఎన్టీవీ రఫిక్, కే ఎస్ కే సునీల్, వెన్నెల టీవీ రాజు తదితరులు పాల్గొన్నారు.
