జయరాం జన్మదిన వేడుకలను గుంతకల్లు, గుత్తి, పామిడి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలలో మండలాల వ్యాప్తంగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు బాణసంచా పేల్చి, కేకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొన్ని అనివార్య కారణాలవల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పటికీ సోషల్ మాధ్యమాల ద్వార జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో అనాధాశ్రమంలో, ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు, వృద్ధులకు, పాలు ,పండ్లు ,బ్రెడ్ తో పాటు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా NDA కూటమి నాయకులు గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా రావడం గుంతకల్లు నియోజకవర్గం ప్రజలు అదృష్టమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మరియు అనుబంధ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.
