భారతీయ పత్తి సంస్థ ద్వారా అనంతపురం జిల్లా గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మద్దతు ధరకే పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. పింజ పొడవును బట్టి 29.50 -30.50 mm ఉన్నది కనీస మద్దతు ధర రూ.8110/క్వింటాలు, పింజ పొడవు 29.01-29.49 mm ఉన్నది రూ.8060/క్వింటాలు,పింజ పొడవు 27.50-28.50 mm ఉన్నది కనీస మద్దతు ధర రూ.8010/క్వింటాలు.తేమ 8% లేక అంత కంటే తక్కువ నుండి 12% వరకు మాత్రమే ఉండవలెను, 8% నుండి 12% వరకు పెరిగిన ప్రతి ఒక శాతానికి 1% చొప్పున మద్దతు ధరలో తగ్గించబడును, 12% కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని సి సి ఐ వారు కొనుగోలు చేయరు. రైతులకు వారి ఆధార్ మరియు బ్యాంకు ఖాతా లింక్ అయిన ఖాతాకు డబ్బు జమ చేయడం జరుగుతుంది. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తిని అమ్మి మద్దతు ధర పొందగలరు. పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్మదలచుకున్న రైతులు ముందుగా మీ మొబైల్లో kapas kisan app ను డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలు నమోదు చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, రైతులు మరింత సమాచారం కోసం సమీప రైతు సేవా కేంద్రంలో సంప్రదించగలరు.
మండల వ్యవసాయ అధికారి ముస్తాక్ అహ్మద్ తెలిపారు









