అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో మాడి వెంకట స్వామి తోటలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు.ఈసందర్బంగా వంద సంవత్సరాల ఉసిరక వృక్షానికి, తులసి మాతకు పెద్దయత్తున భక్తాదులు పూజలు చేశారు. పురోహితుని ద్వారా సంకల్ప పూజలు, కార్తీక మాసం ద్వాదశి సందర్బంగా ధాత్రి, దామోదర పూజలు చేశారు. చెట్టు క్రింద శివ అభిషేకం దీపారాధనలు చేశారు. ఉసిరిక చెట్టు పూజలు అత్యంత పుణ్య ప్రాధంగా హిందువులు భావిస్తారు. వివిధక్రీడా పోటీలు నిర్వహించి గెలిచిన వారికి ఆర్యవైశ్య సంఘం వారు బహుమతులు ఇచ్చారు. అనంతరం కొత్తురు రామ మోహన్ అనురాధ కుటుంబ సభ్యులు వనభోజనం అందించారు. నూతనంగా ఏర్పాటైన ఆర్య వైశ్య సంఘం పాలకమండలని ఆర్యవైశ్య యువజన సంఘం వారు ఘనంగా సత్కరించారు.










