గుత్తి, అనంతపురం జిల్లా: గుత్తి ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 17న జరగబోయే “చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా నాయకుడు ఎన్. వీరన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కరపత్రాలను ఆవిష్కరించారు.
వీరన్న మాట్లాడుతూ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి పాల్పడిన వ్యక్తిపై ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరి నిరసన తెలపాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు సత్య, చలపతి, అయ్యప్ప, ఓబులేసు, లక్ష్మన్న, లక్ష్మీనారాయణ, రూపేష్, సూర్యనారాయణ, ఓబయ్య, నగేష్, వెంకటేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.










