అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ చేతుల మీదగా పెద్దవడుగూరు సిఐ రామసుబ్బయ్య విధుల్లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మరియు లా అండ్ ఆర్డర్ పాటిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న సందర్భంగా అభినందిస్తూ ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐ రామసుబ్బయ్య మాట్లాడుతూ విధుల్లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ అందర్నీ కలుపుకొని పోతూ తన పరిధిలో శాంతి భద్రతలనుకాపాడుతూ విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. మండలంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సిఐకు ప్రశంస పత్రము అందుకోవడం పట్ల మండల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పలువురు సాంఘిక మాధ్యమాల ద్వారా, వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.









