అనంతపురం జిల్లా, గుత్తి: గుత్తి పట్టణ పరిధిలో నడుస్తున్న మట్కా స్థావరాలపై పోలీసులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. గుత్తి అర్బన్ సీఐ రామారావు, ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
అమృత టాకీస్ వెనకాల కాలనీ ప్రాంతం, అలాగే గుంతకల్లు రోడ్‌లోని అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో శనివారం
పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా నగదాని శివ, దూదేకుల ముబారక్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వారి వద్ద నుంచి రూ. 62,000 నగదు, పెద్ద మొత్తంలో మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఈ దాడుల్లో ఏఎస్ఐలు నాగమణిక్యం, రామాంజనేయులు, అలాగే పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు మట్కా కార్యకలాపాలను నిర్మూలించేందుకు ఇలాంటి దాడులు కొనసాగుతాయని తెలిపారు.










