అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల పట్ల సోమవారం ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు బీసీ వెంకప్ప అధ్యక్షతన స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థను, వీధిలైట్లను, పైపులైన్ల లీకేజీలను పునరుద్ధరించాలంటూ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నారాయణ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు టీ తిమ్మారెడ్డి, మహిళా నాయకురాలు హేమలత, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆర్ నారాయణ, సీనియర్ నాయకుడు సంజీవ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు నూర్ హసన, ప్రేమ్ కుమార్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.









