అనంతపురం జిల్లా గుత్తి తాసిల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కులగణన, జనాభాల గణాంకాల ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లు అమలుపరచాలని వారు డిమాండ్ చేశారు. బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారు రక్షించుకుంటూ రాజకీయంగా ఎదగాలంటూ వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళిత గిరిజన మైనార్టీ లపై దాడులు జరిగితే భారత కమ్యూనిస్టు పార్టీ వారికి అండగా ఉద్యమిస్తుందని వారు హెచ్చరిస్తూ డిప్యూటీ తాసిల్దార్ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రాజు యాదవ్, మండల కార్యదర్శి జి రామదాస్, మండల సహాయ కార్యదర్శిలు నరసింహయ్య, వెంకట్రాముడు, పట్టణ సహాయ కార్యదర్శిలు నజీర్, మహమ్మద్, ఏఐటిసి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రజాక్, సూరి, నగదాని రామంజి, సీనియర్ నాయకులు రామకృష్ణ, టి భాష, గోపాల్, గంపన్న, బెస్త శివకుమార్ తదిరులు పాల్గొన్నారు









