అనంతపురం జిల్లా, పుట్టపర్తి: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిని సందర్శించిన భారతదేశ విశ్వగురు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు FCI ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ వనగొందివిజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి అభివాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా వనగొందివిజయలక్ష్మి ప్రధానమంత్రిని సందర్శించడం స్థానికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పుట్టపర్తిలో జరుగుతున్న శతజయంతి ఉత్సవాలకు జాతీయ స్థాయి నేతల రాకతో ఆధ్యాత్మిక వాతావరణం మరింతగా ఉత్సాహభరితమైంది.









