అనంతపురం జిల్లా గుత్తి పట్టణం గాంధీ సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైయస్సార్సీపి రాష్ట్ర పంచాయతీ వింగ్ ఆధ్వర్యంలో తలపెట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వైయస్సార్సీపి రాష్ట్ర అధికారిక పంచాయతీ రాజ్ కార్యదర్శి సివి రంగారెడ్డి, వైయస్సార్సీపి జిల్లా నాయకులు క్రషర్ మధుసూదన్ రెడ్డి, మైను ఉద్దీన్ అధ్యక్షతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వన్నూరు బి, ఎంపీపీ విశాలాక్షి, వైయస్సార్సీపి జిల్లా నాయకురాలు రాధా యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వా వైద్య కళాశాలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గ్రామ పట్టణ నగర లలో వాడవాడల కోటి సంతకాల సేకరణను విజయవంతం చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యలు అందుబాటులోకి రావాలని దృఢ సంకల్పంతో కేంద్రం చొరవతో రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు మంజూరు చేయించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కుట్రను తిప్పి కొట్టాలని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు మాజీ ఎంపీపీ కొనామురళీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ హుస్సేన్ పీరా, గురు ప్రసాద్ యాదవ్, షఫీ, హరి జిరాక్స్ సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు వాల్మీకి శివ, నరేష్, కార్యకర్తలు చెట్నేపల్లి నాగేంద్ర, అరటి పండ్ల చంద్ర, సునీల్, స్టోర్ అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు.









