అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని దిమ్మగుడి గ్రామంలో రెండో విడత అన్నదాత సుఖీభవ మరియు గ్రామసభ నిర్వహణ కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా గ్రామాల్లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, కావున కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి గ్రామసభలు నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని గ్రామంలో ఉన్న సమస్యలు గ్రామ సభ ద్వారా చర్చించి, పరిష్కరించడానికి ప్రభుత్వ సహాయ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామసభలు నిర్వహణ వల్ల సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల సారథ్యంలో పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఉషారాణి, ఎస్ఐ ఆంజనేయులు, ఎంపీడీవో బారేన్ సాహెబ్, హౌసింగ్ ఏఈ నెట్టికంటయ్య, తెదేపా నాయకులు మండల కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, రాజా రెడ్డి, కేశవరెడ్డి, కొండూరు కేశవరెడ్డి, గంగరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు









