అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన, చెప్పుకునేది తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి ప్రజా ప్రతినిధులు ప్రజల్లో మమేకం కావడం హర్షనీయం అన్నారు. అనంతరం ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన గ్రీవెన్స్ మరియు ప్రజాదర్బార్ లో వచ్చినటువంటి ప్రజల ఫిర్యాదులను పరిష్కరించుటకై సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పామిడి పట్టణ బాధ్యులు గుమ్మనూరు ఈశ్వర తో పాటు మండల వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










