అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు ప్రాంతాలలో లో వోల్టేజీ సమస్యలను గుర్తించి ఏపీఎస్ పీడీసీఎల్ వారు దాదాపు 16 లక్షల రూపాయల అంచనావేయముతో విద్యుత్ చాలక బలము నియంత్రణ యంత్రములు ఏర్పాటు కు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.సాయి శంకర్ తెలిపారు. స్థానికంగా చంద్ర ప్రియ నగర్ ప్రధాన రస్తానందు, అనంతపూర్ రోడ్డు నందు పంప్ హౌస్ వద్ద సర్వీసులు దూర ప్రాంతంలో ఉండడం వల్ల లో వోల్టేజీ నివారణకు, అలాగే మాతృశ్రీ వైద్యశాల ఎదురుగా కమర్షియల్ సర్వీసులకు, గృహ సర్వీసులకు నివారణకు, సూరసింగన్నపల్లి కర్నూలు రోడ్డు వైపుగా ఉన్న అంకాలమ్మ దేవాలయం వద్ద 100 కెవిఎ సామర్ధ్యము గల విద్యుత్ శాఖ బలము నియంత్రణ యంత్రం లను నాలుగు ప్రాంతములలో ఏర్పాటు చేయడానికి వేగవంతంగా పనులు ప్రారంభించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల విద్యుత్ అంతరాయములు లేని విద్యుత్ సరఫరా కొరకు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఏపీఎస్ పిడిసిఎల్ వారికి సహకరించాలని వారు పత్రికా ప్రకటన చేశారు.









