అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకొన గుంతకల్ నియోజకవర్గం వైఎస్ ఆర్ సి పి మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ వన్నూరు బి, పట్టణ, మండల కన్వీనర్లు క్రషర్ మధుసూదన్ రెడ్డి, గంగరాజుల ఆధ్వర్యంలో జై జగన్, జై వైవిఆర్ అంటూ నినాదాలు చేస్తూ కేకును కత్తిరించి ఒకరినొకరు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా, సివి రంగారెడ్డి,సుభాష్ రెడ్డి, షఫీ, కౌన్సిలర్లు రమణ, వరదరాజులు, స్టోర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.










