అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజవర్గం గుత్తి పట్టణంలోని 13, 15, 22 వ వార్డులలోఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణి కార్యక్రమంలో కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా అమలుచేసిన పథకాలు, అభివృద్ధి, తదితర వివరాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17 నెలలలోనే దాదాపు 50,763 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లకు ఖర్చుపెట్టిన ఏకైక ప్రభుత్వం అన్నారు. పేదరికం లేని సమాజమే కుటమి ప్రభుత్వ లక్ష్యమని, సంపద సృష్టించి, పేదలకు పంచుతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసినట్లు అబద్ధాలతో సమయం వృధా చేయమని, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నామని వివరించారు. సమాజంలో ఆర్థిక అసమానతలు లేని సమాజ స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం ద్వారా పేదలను ఆదుకుంటారని తెలిపారు. NDA ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలుపరచడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు చికెన్ శ్రీనివాసులు, వీఆర్వో రమేష్, మాజీ కౌన్సిలర్ సుంకన్న,సుధాకర్ నాయుడు, కట్టెల సుధాకర్ ,ఎస్ ఎం భాష, పిల్లెళ్లి కృష్ణ, నగదాని శివ,రంగస్వామి,కుళ్లాయప్ప, పవన్ , దేవేంద్ర, నిజాం, చాంద్ బాషా, ఈరన్న గౌడ్ , వాల్మీకి రాము,రాహుల్, రామాంజనేయులు ఆచారి తదితర NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.










