అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి వన్నె దొడ్డి గ్రామంలో మెడికల్ ఆఫీసర్ డా. ప్రవీణ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ప్రోగ్రాం అధికారి నారాయణస్వామి, జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్స్ జి. ఆంజనేయులు ఫ్లోరోసిస్ మరియు క్యాన్సర్ కార్యకలాపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బందికి మరియు ప్రజలకు ఫ్లో రోసిస్ పై అవగాహన కల్పిస్తూ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితులకు, చేతి కర్రలు,వాకర్స్, నడుము, మెడ బెల్టులు అందజేశామని తెలియజేశారు ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పాఠశాలలో విద్యార్థులకు ఫ్లోరోసిస్ఫై అవగాహన కల్పించవలనని తెలియజేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, క్షేత్రస్థాయి లో ఫ్లోరోసిస్ బాధితులను గుర్తించి ఆరోగ్య విద్య అందించాలని, సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు మల్టీవిటమిన్ మాత్రలతో పాటు ఆహారపు అలవాట్ల గురించి తెలియజేయాలని వారు పేర్కొన్నారు.వాటర్ శాంపిల్ సేకరణ చేసి అవసరం ఉన్నవారికి పునరావాస పరికరాల పంపిణీ చేయాలనీ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని స్థూల స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో శ్రీరాములు, కిషోర్, ఆరోగ్య సిబ్బంది, CHOs, ANMs, ఆశ, హెల్త్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.










