అనంతపురం జిల్లా, గుత్తి మండలం : గుత్తి మండలంలోని పూలకుంట గ్రామ శివారులో సాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు, సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ నేతృత్వంలో జరిగిన ఈ ఆకస్మిక తనిఖీలో మొత్తం 18 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాడి సందర్భంగా పేకాటరాయుళ్ల వద్ద నుండి రూ. 42,230 నగదు, పేకముక్కలు స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ జూదాన్ని అరికట్టేందుకు ప్రత్యేక సమాచారంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఏఎస్ఐ రామాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ హనుమంతు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అనధికార పేకాట శిబిరాలపై చర్యలు కఠినంగా కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.










