అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెల్లూరు జిల్లాలోని సిపిఎం పార్టీ నాయకుడు పెంచలయ్యని గంజాయి ముఠా కామాక్షమ్మ తదితరులు హత్య కేసులో ముద్దాయిలని వారిని వెంటనే శిక్షించాలని సిపిఎం పార్టీగా నెల్లూరు జిల్లాలో ఈరోజు బంద్ కు పిలుపునిచ్చారు బంద్ కు మద్దతుగా ఈరోజు గుత్తిలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని ఆర్డిటి కాలనీలో నివసిస్తున్న సిపిఎం పార్టీ యువ నాయకుడు పెంచలయ్య కళాకారుడు గంజాయికి వ్యతిరేకంగా స్కూల్ ల దగ్గర కాలేజీల దగ్గర యువతకు పాటలు పాడుతూ అవగాహన కల్పిస్తున్నాడని, గంజాయి ముఠాకి చెందిన కామాక్షమ్మ మరియు వారి అనుచరులు నవంబర్ 29 తేదీ 19 సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపేశారని ఆరోపించారు. ఎక్కడ చూసినా గంజాయి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా సరఫరా జరుగుతున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మత్తుపదార్థాల ముఠాలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి గంజాయి నిర్మూలనకు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది.ఇప్పటికే మత్తు పదార్థాలు సేవించి యువకులు మహిళలని చిన్నపిల్లల్ని అత్యాచారాలు చేసి చంపడం జరుగుతుంది. ఎన్నో సందర్భాల్లో మహిళల పైన అత్యాచారాలు జరిగి చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరిగినప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాటి పైన దృష్టి పెట్టి గంజాయి మాఫియాలను అరికట్టలేకపోతున్నారని వాపోయారు. రాబోవు దినంలో మత్తు పదార్థాలు అరికట్టకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పెంచలయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతలు వహించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుక, కెవిపిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్, నాగరత్నమ్మ, మల్లికా తదితరులు పాల్గొన్నారు.










